Vijayanirmala: టీడీపీలో చేరి అసెంబ్లీకి పోటీ... ఓటమితో రాజకీయాలు వద్దే వద్దనుకున్న విజయనిర్మల!

  • 1999లో టీడీపీలో చేరిక
  • కైకలూరు నుంచి పోటీ
  • వెయ్యి ఓట్లకు పైగా తేడాతో ఓటమి

ప్రముఖ నటి, సూపర్ స్టార్ కృష్ణ భార్య, దర్శకురాలిగా అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కిన విజయనిర్మల గత అర్ధరాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆమె భౌతికకాయం మరికాసేపట్లో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రి నుంచి నానక్ రామ్ గూడలోని ఇంటికి చేరనుంది.

కాగా, ఆమె గతంలో రాజకీయాల్లోకి వచ్చి రాణించాలని భావించి, విఫలమయ్యారు. అంతటితో, తనకు రాజకీయాలు అచ్చిరావని నిర్ణయించుకుని, వాటికి దూరంగా ఉన్నారు. 1999లో తెలుగుదేశం పార్టీలో చేరిన ఆమె, కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థినిగా పోటీ చేయగా, ఎర్నేని రాజా రామచందర్ చేతిలో వెయ్యి ఓట్లకు పైగా తేడాతో ఓటమి పాలయ్యారు. ఆపై ఆమె మరోసారి రాజకీయాల్లోకి కాలు మోపాలని అనుకోలేదు. ఆ ఓటమి దెబ్బతో ఆమె తనకు రాజకీయాలు అచ్చిరావని నిర్ణయించుకున్నారు.

Vijayanirmala
Telugudesam
Telugudesam
Politics
  • Loading...

More Telugu News