Andhra Pradesh: ఏపీలో త్వరలో నూతన మార్కెట్ కమిటీలు: మంత్రి మోపిదేవి

  • మార్కెటింగ్ శాఖ పని తీరుపై సమీక్ష
  • నూతన కమిటీల్లో రైతులకే అధిక ప్రాధాన్యత
  • రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు 

ఏపీలో త్వరలో నూతన మార్కెట్ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్టు మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ ప్రకటించారు. మార్కెటింగ్ శాఖ పని తీరుపై ఈరోజు ఆయన సమీక్షించారు. నూతన కమిటీల్లో రైతులకే అధిక ప్రాధాన్యమిస్తామని చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కోసం రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో మార్కెటింగ్ శాఖలో జరిగిన పనులపై ఉన్నత స్థాయి విచారణ జరిపిస్తామని అన్నారు.

Andhra Pradesh
marketing
minister
mopi devi
  • Loading...

More Telugu News