Undavalli: ప్రజావేదికను అర్ధరాత్రి సమయంలో కూల్చడమేంటి?: నారా లోకేశ్

  • కృష్ణానదికి వంద మీటర్ల దూరంలో ప్రజావేదిక ఉంది
  • గ్రీన్ ట్రైబ్యునల్ తీర్పు చూస్తే తెలుస్తుంది
  • కరకట్టపై ఉన్నవన్నీ అక్రమ నిర్మాణాలు కాదు

ఉండవల్లిలోని అక్రమనిర్మాణం ప్రజావేదిక కూల్చివేతపై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు చేశారు. కృష్ణా నదికి వంద మీటర్ల దూరంలో ప్రజావేదిక ఉందని అన్నారు. ప్రజావేదికను అర్ధరాత్రి సమయంలో కూల్చడమేంటి? అని ప్రశ్నించారు. కరకట్టపై ఉన్న నిర్మాణాల్లో ఏవి నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయో, ఏవి లేవో గ్రీన్ ట్రైబ్యునల్ తీర్పు చూస్తే తెలుస్తుందని అన్నారు. ఈ తీర్పు ప్రకారం కృష్ణానదికి వంద మీటర్ల దూరంలో ప్రజావేదిక భవనం ఉందని గుర్తుచేశారు. కరకట్టపై ఉన్న వన్నీ అక్రమ నిర్మాణాలు కాదని చెప్పారు.

Undavalli
Chandrababu
Ex cm
Nara Lokesh
  • Loading...

More Telugu News