Polavaram: పోలవరం అంశంలో వెంకయ్యనాయుడు సూచనలపై వెంటనే నిర్ణయం తీసుకున్న ప్రకాశ్ జవదేకర్

  • పోలవరంపై పలు కేసులున్నాయి
  • అందుకే ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ వచ్చాం
  • ఏపీ అభివృద్ధికి మోదీ కట్టుబడి ఉన్నారు

పోలవరం ప్రాజక్టు విషయంలో కేంద్ర పర్యావరణ శాఖకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పలు సూచనలు చేసిన సంగతి తెలిసిందే. స్టాప్ వర్క్ ఆర్డర్ నిలుపుదల రెండేళ్లపాటు కొనసాగించాలని వెంకయ్యనాయుడు సూచించగా, కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేవకర్ సానుకూలంగా స్పందించారు.

దీనిపై ఆయన మాట్లాడుతూ, పోలవరం ప్రాజక్టు పనులు కొనసాగించేందుకు 2014లో  అనుమతులు ఇచ్చింది తానేనని వెల్లడించారు. పోలవరం ప్రాజక్టుకు మోదీ ప్రభుత్వం జాతీయహోదా కల్పించిందని అన్నారు. స్టాప్ వర్క్ ఆర్డర్ నిలుపుదలపై ఏటా ఆదేశాలు ఇస్తున్నామని, ఈసారి రెండేళ్లకు అవకాశం ఇస్తూ ఆదేశాలపై సంతకం చేశానని జవదేకర్ వెల్లడించారు. పోలవరం ప్రాజక్టుపై పలు కేసులు ఉన్నాయని, అందుకే ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ పనులకు ఆటంకం లేకుండా చూస్తున్నామని చెప్పారు. ఏపీ అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ కట్టుబడి ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.

Polavaram
Venkaiah Naidu
Prakash Javdekar
Narendra Modi
BJP
Andhra Pradesh
  • Loading...

More Telugu News