Praja Vedika: ప్రజావేదిక కూల్చివేత తెలివితక్కువ పని... 90 శాతం మంది అసహ్యించుకుంటున్నారు: కోడెల

  • జగన్ సర్కారుపై కోడెల విమర్శలు
  • అంగన్ వాడీకి, ఆశా వర్కర్లకు తేడా తెలియడంలేదు
  • అమ్మఒడిపై స్పష్టతలేదు

ఉండవల్లిలో గత ప్రభుత్వం నిర్మించిన ప్రజావేదిక భవనాన్ని జగన్ సర్కారు కూల్చివేయడంపై మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు స్పందించారు. ప్రజావేదిక కూల్చివేత తెలివి తక్కువ పని అని విమర్శించారు. ప్రభుత్వ వైఖరిని 90 శాతం ప్రజలు అసహ్యించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వానికి అంగన్ వాడీకి, ఆశా వర్కర్లకు కూడా తేడా తెలియడంలేదని ఎద్దేవా చేశారు. పథకాలు ప్రకటించారే గానీ, వాటిపై స్పష్టతలేదని, అమ్మఒడి పథకంపై ప్రభుత్వానికే స్పష్టత లేకపోతే ఎలా? అని ప్రశ్నించారు.

Praja Vedika
Kodela
Telugudesam
Chandrababu
Andhra Pradesh
  • Loading...

More Telugu News