తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఒక ఊపు ఊపబోతోంది: సినీ నటుడు బాబూమోహన్
- తెలంగాణలో ఎంపీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది
- అప్పటి నుంచి ట్రెండ్ మారిపోయింది
- ‘బీజేపీలో ఎప్పుడు చేరమంటారు? అంటూ నాకు ఫోన్లు
‘బీజేపీలో ఎప్పుడు చేరమంటారు? అంటూ తనకు వందల సంఖ్యలో ఫోన్లు వస్తున్నాయని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల పనైపోయిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో అడుగుబొడుగున ఉన్న వాళ్లు కూడా వచ్చి బీజేపీలో చేరుతున్నారని వ్యాఖ్యానించారు. ఏపీలో కూడా టీడీపీ, కాంగ్రెస్ పార్టీల పనైపోయిందని, ‘జగన్ గారొచ్చారు. మంచీ చెడ్డలన్నీ ప్రజలు చూసుకుంటారు’ అని అన్నారు. ఏపీలో ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీయేనని, కనుక, భారతీయ జనతా పార్టీ ఒక ఊపు ఊపబోతోందని బాబూ మోహన్ ధీమా వ్యక్తం చేశారు.