Manchu Manoj: చెన్నై ప్రజల పట్ల ఓ హాలీవుడ్ నటుడికి ఉన్న జాలి కూడా మీకు లేదు... మంచు మనోజ్ ఆగ్రహం

  • డికాప్రియో పోస్టును షేర్ చేసిన మంచు మనోజ్
  • నెటిజన్లకు క్లాస్
  • జాతి, కులం, రాష్ట్రం చూడొద్దంటూ హితవు

చెన్నైలో గుక్కెడు తాగునీరు కూడా దొరక్క ప్రజలు అలమటించిపోతున్న తరుణంలో హాలీవుడ్ స్టార్ లియొనార్డో డికాప్రియో స్పందించడం పట్ల మంచు మనోజ్ వ్యాఖ్యానించారు. ఓ హాలీవుడ్ నటుడు చెన్నై ప్రజల కష్టాలు చూసి చలించిపోయాడని, ఇక్కడున్న నెటిజన్లు అతడ్ని చూసి సిగ్గుపడాలని అన్నారు. మంచు మనోజ్ ఆగ్రహానికి తగిన కారణం ఉంది.

చెన్నై ప్రజల కోసం మనోజ్ తన స్నేహితులతో కలిసి మంచినీరు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. చెన్నై కోసం తాను ముందుకువచ్చానని, మీరు కూడా సాయం చేయండి అంటూ మనోజ్ ట్వీట్ చేయగా, దీనిపై నెటిజన్ల నుంచి వ్యతిరేక స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలోనే, మంచు మనోజ్ నెటిజన్లపై మండిపడ్డారు.

"నేను చెన్నైకి సాయపడడం కొందరు నెటిజన్లకు నచ్చడంలేదు. అలాంటి వారికోసమే ఈ పోస్టు. నేను చెన్నై ప్రజలకు సాయం చేస్తే మీరు వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తారా? ఎక్కడో ఉన్న ఓ హాలీవుడ్ నటుడు డికాప్రియో కూడా మన సమస్య పట్ల స్పందించారు. మీ తీరుపట్ల సిగ్గుపడండి. అతడికి ఉన్నంత జాలి కూడా మీకు లేదు. ముందు మనం మనుషులం. ఆ తర్వాతే జాతి, కులం, రాష్ట్రం!" అంటూ హితవు పలికారు.

Manchu Manoj
Leonardo DiCaprio
Chennai
Water
  • Loading...

More Telugu News