Venkaiah Naidu: పోలవరం ప్రాజక్టుపై కేంద్ర పర్యావరణ శాఖకు వెంకయ్యనాయుడు సూచన

  • ఏపీకి పోలవరం జీవనరేఖ లాంటిదన్న ఉపరాష్ట్రపతి
  • స్టాప్ వర్క్ ఆర్డర్ మరో రెండేళ్లు పొడిగించాలని సూచన
  • ప్రకాశ్ జవదేకర్ కు పరిస్థితి వివరించిన వెంకయ్య

ఏపీకి పోలవరం ప్రాజక్టు జీవనరేఖ లాంటిదని, పోలవరం ప్రాజక్టు అంశంలో ఏపీకి సాయం చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇవాళ కేంద్రానికి సూచించారు. పోలవరం ప్రాజక్టుపై అమల్లో ఉన్న స్టాప్ వర్క్ ఆర్డర్ నిలుపుదలను మరో రెండేళ్లు పొడిగించాలని వెంకయ్యనాయుడు కేంద్ర పర్యావరణశాఖకు తెలిపారు. ఈ మేరకు కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేవకర్ కు పరిస్థితిని వివరించారు. దేశం, ఏపీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకోవాలని అన్నారు. అంతకుముందు, వైసీపీ నేత విజయసాయిరెడ్డి స్పందిస్తూ, పోలవరం విషయంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహకరించాలంటూ విజ్ఞప్తి చేశారు.

Venkaiah Naidu
Polavaram
Vijay Sai Reddy
YSRCP
BJP
  • Loading...

More Telugu News