vijayasai reddy: అయ్యా.. దొంగ లెక్కల మాస్టారు విజయసాయిరెడ్డీ: బుద్ధా వెంకన్న

  • మహామేత హయాంలోనే అక్రమ నిర్మాణాలకు అనుమతులు వచ్చాయి
  • 2004 నుంచి ఇచ్చిన అనుమతుల గురించి కనుక్కోండి
  • తుగ్లక్ ఎవరో అర్థమవుతుంది

అమరావతిలోని ప్రజావేదికను రాష్ట్ర ప్రభుత్వం కూల్చివేసిన నేపథ్యంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య వాగ్యుద్ధం నడుస్తోంది. నదీ పరిరక్షణ చట్టాన్ని యనమల ఓసారి చదవాలనీ, అప్పుడు ఎవరు తుగ్లకో తెలుస్తుందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సూచించిన సంగతి తెలిసిందే. విజయసాయి వ్యాఖ్యలకు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. 'అయ్యా దొంగ లెక్కల మాస్టారు విజయసాయిరెడ్డీ... తమరు చదివే ఉంటారు కదా. ఒక్క ప్రజావేదికను తప్పిస్తే కరకట్ట అంచున ఉన్న అన్ని అక్రమ నిర్మాణాలకు 'మహామేత' హయాంలోనే అనుమతులు వచ్చాయన్న సంగతి ఎలా మరిచారు? అప్పుడు మీకు రివర్ కన్జర్వేషన్ యాక్ట్ గుర్తు రాలేదా?' అని ప్రశ్నించారు.

మంతెన సత్యనారాయణరాజు గారి ఆశ్రమానికి అనుమతులు ఇచ్చిన మల్లాది విష్ణు మీతోనే ఉన్నాడుగా... కాస్త అడిగి తెలుసుకోండని బుద్దా వెంకన్న అన్నారు. 2004 నుంచి ఇచ్చిన అనుమతుల గురించి కనుక్కుంటే తుగ్లక్ ఎవరో అర్థమవుతుంది రెడ్డిగారూ... వెళ్లి ఆ పని చూడండంటూ హితవు పలికారు.

vijayasai reddy
budda venkanna
ysrcp
Telugudesam
  • Loading...

More Telugu News