jagan: 12 కేసుల్లో నిందితుడు మా నేతలపై ఆరోపణలు చేయడం విడ్డూరం: కనకమేడల

  • టీడీపీ నేతలపై విజయసాయి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు
  • ప్రత్యేక హోదా సాధించాల్సిన బాధ్యత జగన్ పై ఉంది
  • ఐదేళ్లు గడిచినా విభజన హామీలను బీజేపీ ప్రభుత్వం అమలు చేయలేదు

ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడి కొన్ని రోజులు కూడా గడవకముందే... అధికార, విపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తమ నేతలపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ మండిపడ్డారు. 12 కేసుల్లో ముద్దాయిగా ఉన్న విజయసాయిరెడ్డి తమ నేతలపై విమర్శలు చేస్తుండటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి జగన్ పై ఉందని చెప్పారు. హోదాతో పాటు, విభజన హామీలను ఐదేళ్లు గడిచినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. మహిళా సాధికారత గురించి గొప్పగా చెప్పే బీజేపీ... మహిళా బిల్లును ఎందుకు ఆమోదించడం లేదని ప్రశ్నించారు.

jagan
vijayasai reddy
kanakamedala
bjp
ysrcp
Telugudesam
  • Loading...

More Telugu News