avanthi srinivas: అంత ధైర్యం జగన్ లో ఉండబట్టే ఉక్కుపాదం మోపుతున్నారు: అవంతి

  • అక్రమ కట్టడాలను కూల్చాలంటే ధైర్యం కావాలి
  • సోనియానే ఎదిరించిన చరిత్ర జగన్ ది
  • టీడీపీ నేతలు ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారు

అక్రమ కట్టడాలను కూల్చాలంటే ఎంతో ధైర్యం కావాలని... ఆ ధైర్యం ముఖ్యమంత్రి జగన్ లో ఉంది కాబట్టే అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. సాక్షాత్తు సోనియాగాంధీ లాంటి వారినే ఎదిరించిన చరిత్ర జగన్ దని చెప్పారు. ఏపీలో టీడీపీ పని అయిపోయిందని అన్నారు. జీవీఎంసీ ఎన్నికల్లో సైతం వైసీపీ జెండా ఎగరాలని విశాఖ నేతలకు పిలుపునిచ్చారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. టీడీపీ నేతల అక్రమాలను భరించలేకే వైసీపీకి ప్రజలు 151 సీట్లను కట్టబెట్టారని చెప్పారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

విశాఖపట్నం ఉత్తర నియోజక వర్గాన్ని గత పాలకులు నిర్లక్ష్యం చేశారని అవంతి విమర్శించారు. అధికారులు, నాయకులు సమన్వయంతో పని చేసి నగరాన్ని అభివృద్ధిపథంలోకి తీసుకెళ్లాలని సూచించారు. అర్హులైన అందరికీ రేషన్ కార్డులు, ఇళ్లు, పెన్షన్లను ఇస్తామని చెప్పారు.

avanthi srinivas
ysrcp
jagan
Sonia Gandhi
  • Loading...

More Telugu News