Telangana: 2023లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తాం: మధ్యప్రదేశ్ మాజీ సీఎం చౌహాన్

  • ఒక్కరోజూ సచివాలయానికి వెళ్లని సీఎం కేసీఆర్
  • కేసీఆర్ కుటుంబ పాలనతో ప్రజలకు ఇబ్బంది 
  • ఒక్క కేంద్ర పథకాన్నీ తెలంగాణలో అమలు చేయట్లేదు

తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలనతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ విమర్శించారు. ఒక్కరోజు కూడా సచివాలయానికి వెళ్లని సీఎంను ఇంతవరకూ తానెప్పుడూ చూడలేదని కేసీఆర్ పై ఆయన విమర్శలు చేశారు. ఒక్క కేంద్ర పథకాన్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడం లేదని వ్యాఖ్యానించారు.

పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీని ఆదరించారని, ఇక్కడ తమ పార్టీ వేగంగా పుంజుకుంటోందని అన్నారు. తెలంగాణ, పశ్చిమ బెంగాల్ లో మంచి ఫలితాలు వచ్చాయని సంతోషం వ్యక్తం చేశారు. ఏపీ, తెలంగాణ, పశ్చిమబెంగాల్, తమిళనాడు, కశ్మీర్ లో బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేయబోతున్నామని అన్నారు. 2023లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తామని, జులై 6న బీజేపీ సభ్యత్వ నమోదును మోదీ ప్రారంభించనున్నట్టు చెప్పారు. 

Telangana
cm
kcr
Madhya Pradesh
chouhan
  • Loading...

More Telugu News