Andhra Pradesh: నా ఖర్మ.. నీతో నీతులు చెప్పించుకోవాల్సి వస్తోంది.. విజయసాయిరెడ్డికి దేవినేని ఉమ కౌంటర్!

  • బ్రీఫ్ కేసు బినామీ కంపెనీలు పెట్టావు
  • 16 నెలలు జైలులో ఉన్న నువ్వు కూడా చెబుతున్నావ్
  • ఇప్పటికైనా మంచిగా ఉండు
  • అమరావతిలో మీడియాతో టీడీపీ నేత

వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఇటీవల టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమపై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తాజాగా విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, దేవినేని ఉమామహేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. ‘ఇవాళ వైసీపీ నేత విజయసాయిరెడ్డి ట్వీట్లు కొడుతున్నాడు. ఆయన ఏ2 ముద్దాయి. నా ఖర్మ అయ్యా. నీతో నీతులు చెప్పించుకోవాల్సిన ఖర్మ పట్టింది నాకు.

నువ్వు బినామీ బ్రీఫ్ కేసు కంపెనీలు పెట్టి ఏ2 ముద్దాయిగా 16 నెలలు జైలులో ఉన్నావు. ఇవాళ కాలం కలిసి వచ్చింది. ఈరోజు ఢిల్లీలో ఓ కేబినెట్ హోదాను వెలగబెడుతున్నావ్. ట్వీట్ల మీద ట్వీట్లు పెడుతున్నావ్. నన్ను దొంగ అంటున్నావ్. నువ్వు చెప్పే దొంగ కేసుల్లో నేను ఇంకా దొంగను కాలేదు విజయసాయిరెడ్డీ. పిచ్చి మాటలు మానేయ్. మంచిగా ఉండు’ అని హితవు పలికారు.  

Andhra Pradesh
YSRCP
Vijay Sai Reddy
Telugudesam
Chandrababu
devineni uma
praja vedika demolition
  • Loading...

More Telugu News