Andhra Pradesh: ‘జబర్దస్త్’ షోకు మంచి ప్రశంసలు వచ్చాయి.. తీవ్రమైన విమర్శలు కూడా వచ్చాయి!: అనసూయ భరద్వాజ్

  • అయినా అందరి మోముల్లో నవ్వులు పూయిస్తున్నాం
  • ఐదేళ్లు దాటిపోయినా షో విజయవంతంగా సాగుతోంది
  • ఇందుకు దర్శకులు నితిన్-భరత్ లే కారణం

తెలుగు కామెడీ షో జబర్దస్త్ కు మంచి ప్రశంసలు, తీవ్రమైన విమర్శలు దక్కాయని యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ తెలిపింది. అయినా లక్షలాది మంది మోముల్లో ప్రతివారం తాము నువ్వులను పూయిస్తున్నామని వ్యాఖ్యానించింది. దాదాపు అర్ధ దశాబ్దం దాటినా ఈ షోను విజయవంతంగా కొనసాగిస్తున్నామనీ, ఇందుకు దర్శకులు నితిన్, భరత్ లే కారణమని కితాబిచ్చింది.

తాను సెట్ లో ఏం అడిగినా, ఫిర్యాదు చేయాలనుకున్నా, సలహాలు కోరినా ఈ ఇద్దరు దర్శకులు హుందాగా, ఓపిగ్గా సమాధానాలు ఇచ్చేవారని అనసూయ ప్రశంసించింది. నిరాడంబరంగా, ఓపిగ్గా ఉండే వీరిద్దరూ జీవితంలో సరికొత్త ఎత్తులకు చేరుకోవాలని కోరుకుంటున్నట్లు అనసూయ పేర్కొంది. ఈ మేరకు అనసూయ భరద్వాజ్ ట్వీట్ చేసింది.

Andhra Pradesh
Telangana
jabardast
anasuya
Twitter
Instagram
  • Loading...

More Telugu News