Narendra Modi: ముస్లింల పట్ల కాంగ్రెస్‌ నేత వ్యాఖ్యలకు ఇదిగో రుజువు: వీడియో పోస్టు చేసిన బీజేపీ ఐటీ విభాగం

  • ట్విట్టర్‌లో వీడియోను ఉంచిన విభాగం హెడ్‌ అమిత్‌ మాల్వియా
  • అది కాంగ్రెస్‌ మాజీ ఎంపీ ఆరిఫ్‌ మహ్మద్‌ఖాన్‌ ఇంటర్వ్యూ
  • పార్లమెంటులో కాంగ్రెస్‌ వ్యాఖ్యలను గుర్తు చేసిన మోదీ

ముస్లింల పట్ల కాంగ్రెస్‌ వైఖరి ఎలాంటిదో తెలియజేస్తూ ఆ పార్టీ నేత ఒకరు చేసిన వ్యాఖ్యలను ప్రధాని మోదీ పార్లమెంటులో ప్రస్తావించి ఇరవై నాలుగు గంటలు గడవక ముందే అందుకు సంబంధించిన వీడియోను బీజేపీ ఐటీ విభాగం హెడ్‌ అమిత్‌ మాల్వియా ట్విట్టర్‌లో ఉంచారు.

‘ముస్లింలను ఉద్ధరించడం మా పార్టీ పనికాదు. వాళ్లు బురదలో పడి ఉంటామంటే అక్కడే ఉండమనండి’ అంటూ కాంగ్రెస్‌ ఎంపీ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేస్తున్న సందర్భంగా మోదీ ఆయన వ్యాఖ్యలను ప్రస్తావించారు. మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.

 దీనిపై మోదీ సమాధానమిస్తూ తానేమీ లేని మాటలు చెప్పడం లేదని, కావాలంటే ఆయన మాటల వీడియోను పోస్టు చేస్తానంటూ ప్రకటించారు. ఆయన ఇలా చెప్పిన కొద్ది గంటలకే ట్విట్టర్‌లో వీడియోను పోస్టు చేశారు అమిత్‌ మాల్వియా. ‘ముస్లింల పేరు చెప్పి కన్నీరు కార్చే కాంగ్రెస్‌ నిజస్వరూపం ఇది’ అంటూ వీడియో కింద ఆయన ఓ వ్యాఖ్య కూడా జోడించారు. అయితే ఈ ఇంటర్వ్యూ ఎప్పుడు, ఏ మీడియా ప్రతినిధికి ఇచ్చారన్న దానిపై స్పష్టత లేదు.

Narendra Modi
Congress
arif mahmadkhan
Twitter
  • Loading...

More Telugu News