Andhra Pradesh: నా సీనియర్ సహచరుడు అశోక్ గజపతి రాజుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు!: చంద్రబాబు

  • నేడు అశోక్ గజపతి రాజు పుట్టిన రోజు
  • ట్విట్టర్ లో స్పందించిన చంద్రబాబు
  • ధన్యవాదాలు తెలిపిన అశోక్ గజపతిరాజు

టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు పుట్టినరోజు నేడు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ట్విట్టర్ లో స్పందించారు. ‘నా సీనియర్ సహచరుడు అశోక్ గజపతిరాజు గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయన మరింతకాలం సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు.

కాగా, చంద్రబాబు ట్వీట్ కు స్పందించిన అశోక్ గజపతి రాజు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ కూడా అశోక్ గజపతి రాజుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ఆయురారోగ్యాలతో,అవిశ్రాంతంగా ఆయన ప్రజాసేవలో కొనసాగాలని కోరుకుంటున్నట్లు లోకేశ్ ట్వీట్ చేశారు.

Andhra Pradesh
Telugudesam
Chandrababu
Twitter
ashok gajapati raju
  • Error fetching data: Network response was not ok

More Telugu News