teacher: హైదరాబాదులో దారుణం.. టీచర్ చున్నీ లాగిన పోకిరీలు

  • రాజేంద్రనగర్ న్యూఫ్రెండ్స్ కాలనీలో ఘటన
  • రోడ్డు మీద వెళ్తున్న టీచర్ చున్నీ లాగిన ఆకతాయిలు
  • దేహశుద్ధి చేసిన స్థానికులు

ఎన్ని చట్టాలు వచ్చినా, ఎందరికి శిక్షలు పడినా ఆకతాయిలు మాత్రం తీరు మార్చుకోవడం లేదు. సభ్య సమాజం సిగ్గు పడేలా వారి ఆగడాలు శ్రుతి మించుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిసర ప్రాంతంలో మరో ఘటన చోటుచేసుకుంది. ఓ టీచర్ రోడ్డు మీద వెళ్తుండగా ఆకతాయిలు ఆమె చున్నీ లాగారు. స్థానికంగా ఉన్న న్యూఫ్రెండ్స్ కాలనీలో ఈ ఘటన జరిగింది. పోకిరీల ప్రవర్తనకు భయపడిపోయిన బాధితురాలు గట్టిగా కేకలు వేసింది. వెంటనే అక్కడకు వచ్చిన స్థానికులు... పోకిరీలను పట్టుకుని, దేహశుద్ధి చేశారు.

teacher
chunni
hyderabad
harrassment
  • Loading...

More Telugu News