krishna karakatt: చంద్రబాబు ఉంటున్నది అక్రమ నిర్మాణం...ఆయన తక్షణం ఖాళీ చేయాలి: ఆళ్ల రామకృష్ణారెడ్డి

  • ప్రజావేదిక కూల్చివేతను జనం హర్షిస్తున్నారు
  • అందువల్ల  చంద్రబాబును నేను వదిలి పెట్టేది లేదు
  • కరకట్టపై 60కి పైగా అక్రమ నిర్మాణాలు

కృష్ణానది కరకట్టపై ఉన్న అక్రమ నిర్మాణంలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసం ఉంటున్నారని, ప్రజా వేదిక కూల్చివేత తర్వాతైనా ఆయన తక్షణం ఆ భవనాన్ని ఖాళీ చేయాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రజా వేదిక కూల్చివేతను జనం హర్షిస్తున్నారని, అటువంటి పరిస్థితుల్లో అక్రమ కట్టడంలో ఉన్న చంద్రబాబు ఇంకా అక్కడే ఉండాలని అనుకోవడం అన్యాయమన్నారు. అయినా చంద్రబాబును తాను వదిలి పెట్టేది లేదన్నారు. కరకట్టమీద 60కిపైగా అక్రమ నిర్మాణాలు ఉన్నాయని, వాటన్నింటికీ  నోటీసులు జారీ చేయించినట్లు తెలిపారు. వాస్తవానికి ఈనెల 21వ తేదీనే ఈ కేసులన్నీ న్యాయస్థానం ముందుకు రావాల్సి ఉందన్నారు. అయితే వ్యవస్థల్ని మేనేజ్‌ చేయడంలో చంద్రబాబు సమర్థుడన్నారు. అక్రమ నిర్మాణాలపై నోటీసులు అందుకున్న వారంతా తమంత తాము కట్టడాలను ఖాళీ చేయాలని, జగన్‌ మంచి మనసును అర్థం చేసుకుని వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.

krishna karakatt
prajavedika
Chandrababu
alla ramkrishnareddy
  • Loading...

More Telugu News