Andhra Pradesh: బీజేపీలోకి మెగాస్టార్ వస్తే మనస్ఫూర్తిగా స్వాగతిస్తాం: మాజీ మంత్రి మాణిక్యాలరావు

  • ఏపీలో త్వరలో భారీ కుదుపు రాబోతోంది
  • కాంగ్రెస్, జనసేన నుంచి భారీ చేరికలు
  • చంద్రబాబు సహా 150 మంది కనుమరుగైపోతారు

కాంగ్రెస్ పార్టీ నేత, మెగాస్టార్ చిరంజీవి బీజేపీలో చేరబోతున్నారా? ఏపీలో పార్టీ పటిష్టతపై కన్నేసిన కమలనాథులు, మెగాస్టార్ ఇమేజ్ ను క్యాష్ చేసుకోనున్నారా? అంటే బీజేపీ నేతలు అవుననే సంకేతాలు ఇస్తున్నారు. తాజాగా ఏపీ మాజీ మంత్రి, బీజేపీ నేత పైడికొండల మాణిక్యాలరావు స్పందిస్తూ.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో త్వరలోనే భారీ కుదుపులు రాబోతున్నాయని ప్రకటించారు.

కాంగ్రెస్, జనసేన పార్టీల నుంచి బీజేపీకిలోకి భారీగా చేరికలు ఉంటాయని వ్యాఖ్యానించారు. మెగాస్టార్ చిరంజీవి వంటి ఉన్నతమైన విలువలు, ప్రజాభిమానం ఉన్న వ్యక్తి బీజేపీలో చేరితే మనస్ఫూర్తిగా స్వాగతిస్తామని ప్రకటించారు. ఎన్టీఆర్ తర్వాత అంతటి ప్రజాభిమానం ఉన్న నటుడిగా చిరంజీవి గుర్తింపు పొందారని ప్రశంసించారు. ప్రస్తుతం యువనాయకత్వం బీజేపీ వైపు చూస్తోందని చెప్పారు. 2024 నాటికి టీడీపీ అధినేత చంద్రబాబు సహా 150 మంది నేతలు తెరమరుగు అయిపోతారని హెచ్చరించారు. 

Andhra Pradesh
megastar
chiranveeji
manikyalarao
join
  • Loading...

More Telugu News