KAPaul: తెరకెక్కనున్న కె.ఎ.పాల్‌ జీవితం!

  • ఏర్పాట్లు చేసుకుంటున్న ఓ కొత్త దర్శకుడు
  • హీరోగా సునీల్‌ నటించే అవకాశం
  • ఎన్నికల సందర్బంగా తన భిన్నమైన చేష్టలతో ఆకట్టుకున్న పాల్‌

తన మాటలు, చేష్టలు, విశేషమైన ప్రకటనలతో నిత్యం వార్తల్లో ఉండే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, క్రైస్తవ మత బోధకుడు కె.ఎ.పాల్‌ జీవితం త్వరలో తెరకెక్కనుందని సమాచారం. గడచిన సార్వత్రిక ఎన్నికల్లో తన రాజకీయ చలోక్తులు, పోకడలతో పాల్‌ ఆసక్తి రేకెత్తించిన విషయం తెలిసిందే. చంద్రబాబు, జగన్‌ను మట్టికరిపిస్తానని, అధికారం తనదేనని, పవన్‌ తనతో కలిస్తే స్వీప్‌ చేస్తానంటూ అలవికాని మాటలు చెప్పి ఆశ్చర్యపరిచారు. ఆయన చెప్పింది, సాధించింది ఏమిటన్నది పక్కన పెడితే ఎన్నికల సమయంలో ఏపీ ప్రజలకు మంచి వినోదాన్ని పంచారు.

ఇక ఎన్నికల తర్వాత ఆయన తెరవెనక్కి వెళ్లిపోయారు. అది వేరే విషయం. కానీ జనాన్ని బాగా ఎంటర్‌టైన్ చేసిన ఆయన చేష్టలు సినిమా వాళ్లను ఆకట్టుకున్నాయి. ఈ అంశాల ప్రాతిపదికగా ఓ కొత్త దర్శకుడు పాల్‌ బయోపిక్‌ను తెరకెక్కించే ఆలోచన చేస్తున్నాడని, పాల్ పాత్రను ప్రముఖ నటుడు సునీల్‌ పోషించనున్నారన్న టాక్‌ వినిపిస్తోంది. సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని తెలుస్తోంది. అయితే ఇంకా అధికారికంగా దీనిపై ఎటువంటి ప్రకటన వెలువడలేదు.

KAPaul
baiopic
sunil
  • Loading...

More Telugu News