journalist: నటుడు సల్మాన్ ఖాన్ నాపై దాడిచేశాడు.. నా సెల్‌ఫోన్ లాగేసుకున్నాడు: కోర్టును ఆశ్రయించిన జర్నలిస్ట్

  • వీడియో చిత్రీకరిస్తుండగా ఘటన
  • అడ్డుకుని దుర్భాషలాడిన సల్మాన్
  • ఫోన్ తీసుకుని డేటా డిలీట్

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తనపై దాడిచేశాడంటూ ఓ టీవీ జర్నలిస్టు ముంబై అంధేరీలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసుకు సంబంధించి జర్నలిస్టు తరపు న్యాయవాది నీరజ్ గుప్తా తన వాదనలు వినిపిస్తూ.. తన క్లయింట్‌పై ఏప్రిల్ 24న సల్మాన్ ఖాన్ దాడిచేసినట్టు తెలిపారు. అతడి నుంచి తప్పించుకునేందుకు తన క్లయింట్ ప్రయత్నించగా అతడి సెల్‌ఫోన్‌ను లాక్కున్నాడని, దుర్భాషలాడాడని పేర్కొన్నారు.

సెల్‌ఫోన్‌లోని డేటాను సల్మాన్ డిలీట్ చేశాడని తెలిపారు. సల్మాన్‌ను వీడియోలో చిత్రీకరించే క్రమంలో ఈ ఘటన జరిగినట్టు వివరించారు. ఈ ఘటనపై తన క్లయింట్ పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని నీరజ్ గుప్తా ఆరోపించారు. న్యాయవాది వాదనలు  విన్న న్యాయస్థానం జూలై 24కు కేసును వాయిదా వేసింది.

journalist
Salman Khan
Mumbai
attacked
  • Loading...

More Telugu News