prajavedika: ప్రజావేదిక కూల్చివేతను తక్షణం ఆపాలంటూ హైకోర్టులో పిల్.. కూల్చివేత నిలుపుదలకు నిరాకరించిన కోర్టు!

  • పిల్ వేసిన సామాజిక కార్యకర్త పి.శ్రీనివాసరావు 
  • అర్ధరాత్రి 2:30 దాటిన తర్వాత కూడా వాదనలు
  • విచారణ రెండు వారాల వాయిదా

చంద్రబాబు ఇంటిని ఆనుకుని కృష్ణానది కరకట్టపై ఉన్న ప్రజావేదికను అధికారులు కూల్చివేస్తుంటే మరోవైపు దానిని తక్షణం ఆపాలంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. ప్రకాశం జిల్లా కారంచేడు మండలం స్వర్ణ గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త పి.శ్రీనివాసరావు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. మంగళవారం అర్ధ రాత్రి 2:30 గంటలు దాటిన తర్వాత కూడా హైకోర్టు న్యాయమూర్తుల ఎదుట వాదనలు కొనసాగాయి. పిల్ విచారణ చేపట్టిన జస్టిస్‌ సీతారామమూర్తి, జస్టిస్‌ శ్యాంప్రసాద్‌లు అడ్వకేట్ జనరల్ శ్రీరాం, అదనపు ఏజీ పొన్నవోలు సుధాకరరెడ్డిల వాదనతో ఏకీభవించిన ధర్మాసనం ప్రజావేదిక కూల్చివేత నిలుపుదలకు నిరాకరిస్తూ కేసును రెండు వారాలు వాయిదా వేసింది.

prajavedika
High Court
Andhra Pradesh
  • Loading...

More Telugu News