Chandrababu: గన్నవరం విమానాశ్రయంలో చంద్రబాబుకు ఘన స్వాగతం

  • నిన్న లండన్‌ నుంచి హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు
  • రాత్రి 11 గంటల సమయంలో గన్నవరం చేరుకున్న బాబు
  • ఎయిర్‌పోర్టుకు భారీగా తరలివచ్చిన నేతలు, కార్యకర్తలు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. కుటుంబ సభ్యులతో కలిసి యూరప్‌లో విహారయాత్రకు వెళ్లిన చంద్రబాబు మంగళవారం హైదరాబాద్ చేరుకున్నారు. అనంతరం రాత్రి 11 గంటల ప్రాంతంలో గన్నవరం చేరుకున్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి అధినేతకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా ఉండవల్లి వెళ్లారు. అయితే, అప్పటికే ఉండవల్లిలో ప్రజావేదిక కూల్చివేస్తుండడంతో పరిస్థితి ఉద్రిక్తంగా ఉండడంతో ఏం జరుగుతుందోనని నేతలు ఆందోళన చెందారు. అయితే, చంద్రబాబు నేరుగా ఇంటికి చేరడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Chandrababu
Gannavaram
Telugudesam
Andhra Pradesh
  • Loading...

More Telugu News