Nara Lokesh: ఆరోగ్య పరిరక్షణలో ఏపీ రెండోస్థానంలో నిలవడం చంద్రబాబు పాలనకు నిదర్శనం: నారా లోకేశ్

  • 2015-17 మధ్యకాలంలో ఏపీకి ద్వితీయస్థానం
  • ప్రజారోగ్యం మెరుగయ్యేందుకు చంద్రబాబు ఎన్నో చర్యలు తీసుకున్నారు
  • ట్వీట్ చేసిన లోకేశ్

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆరోగ్య పరిరక్షణ విషయంలో ఎంతగానో కృషి చేశారని మాజీ మంత్రి నారా లోకేశ్ కొనియాడారు. నీతి ఆయోగ్ ఆరోగ్య నివేదిక ప్రకారం ఏపీ 2015-17 మధ్యకాలంలో దేశంలోనే రెండోస్థానంలో నిలిచిందని లోకేశ్ వెల్లడించారు. 23 ఆరోగ్య సూచికలను పరిగణనలోకి తీసుకుని ఈ నివేదిక రూపొందిస్తారని, అలాంటి జాబితాలో ఏపీ ద్వితీయస్థానం దక్కించుకోవడం చంద్రబాబు అవిశ్రాంత కృషి ఫలితమేనని పేర్కొన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజారోగ్యం మెరుగుపరిచేందుకు ఎన్నో చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఈ మేరకు లోకేశ్ ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News