Municipal Elections: తెలంగాణలో మునిసిపల్ ఎన్నికలను ఐదు నెలల్లో పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశాలు

  • మునిసిపల్ ఎన్నికలపై కోర్టును ఆశ్రయించిన ఈసీ
  • మరో రెండు పిటిషన్లు కూడా హైకోర్టులో దాఖలు
  • 119 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు

తెలంగాణలో మునిసిపల్ ఎన్నికలను ఐదు నెలల్లోగా పూర్తి చేయాలని హైకోర్టు ధర్మాసనం నేడు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియ చేపట్టడం లేదంటూ స్వయంగా ఎన్నికల సంఘం హైకోర్టును ఆశ్రయించడంతో పాటు, ఇదే అంశంపై మరో రెండు పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. దీంతో వార్డుల విభజన, రిజర్వేషన్లు, ఇతర ప్రక్రియలను 119 రోజుల లోపు పూర్తి చేయాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తరువాత నెల లోపు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.

Municipal Elections
HIgh Court
Telangana
Election Commission
Reservations
  • Loading...

More Telugu News