Guntur District: ప్రజావేదిక కూల్చివేత ప్రక్రియ ప్రారంభం

  • తగు సూచనలు చేస్తున్న ఉన్నతాధికారులు 
  • ఫర్నిచర్, ఏసీలు, మైకులు, ఇతర సామగ్రి తరలింపు
  • హైకోర్టు సమీపంలోని నర్సరీకి చేరుతున్న పూల కుండీలు

గుంటూరు జిల్లా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం పక్కనే ఉన్న అక్రమ నిర్మాణం ప్రజావేదికను రేపు కూల్చివేయనున్న విషయం తెలిసిందే. సీఎం జగన్ ఆదేశాల నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే అక్కడికి చేరుకున్న సీఆర్డీఏ ఉన్నతాధికారులు, ఇంజనీర్లు సంబంధిత సిబ్బందికి తగు సూచనలు చేస్తున్నారు. ప్రజావేదికలోని ఫర్నిచర్, ఏసీలు, మైకులు, ఎలక్ట్రానిక్ సామగ్రిని వేరే చోటకు తరలిస్తున్నారు. ప్రజావేదిక ప్రాంగణంలోని పూల కుండీలను హైకోర్టు సమీపంలోని నర్సరీకి తరలించినట్టు సమాచారం.

Guntur District
Undavalli
Chandrababu
prajavedika
  • Loading...

More Telugu News