Pawan Kalyan: 'వేద వినీష'... ఓ అభిమాని కుమార్తెకు నామకరణం చేసిన పవన్ కల్యాణ్

  • పవన్ ను కలిసిన వీరాభిమాని
  • శిశువుకు పేరుపెట్టి ఎత్తుకుని ఆడించిన జనసేనాని
  • హర్షం వ్యక్తం చేసిన అభిమాని దంపతులు

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తన వీరాభిమాని కుమార్తెకు నామకరణం చేశారు. చిలకలూరిపేటకు చెందిన యర్రం అంకమ్మరావుకు పవన్ కల్యాణ్ అంటే విపరీతమైన అభిమానం. అంకమ్మరావు భార్య ఇందిర ఇటీవలే ఆడశిశువుకు జన్మనిచ్చింది. తన బిడ్డకు పవన్ కల్యాణ్ తో నామకరణం చేయించాలని అంకమ్మరావు ఆనాడే నిర్ణయించుకున్నాడు.

దాంతో, తన కుమార్తెను తీసుకుని భార్యతో సహా పవన్ కల్యాణ్ వద్దకు వచ్చాడు. అమరావతిలో తనను కలిసిన అంకమ్మరావు కుటుంబాన్ని పవన్ ఎంతో ఆనందానికి గురిచేశారు. ఆ చిన్నారికి 'వేద వినీష' అనే పేరు పెట్టిన పవన్ ఆపై శిశువును రెండు చేతుల్లోకి తీసుకుని లాలించారు. పవన్ తమ కుమార్తెను ఎత్తుకోవడంతో అంకమ్మరావు, ఇందిర దంపతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

Pawan Kalyan
Jana Sena
Veda Vineesha
  • Loading...

More Telugu News