Telugudesam: లోకేశ్‌తో నాకెలాంటి విభేదాలూ లేవు: సుజనా చౌదరి

  • టీడీపీలో అత్యంత గౌరవం లభించింది
  • లోకేశ్ ముందుకు వెళితే సంతోషిస్తా
  • ఎన్నికల్లో చంద్రబాబు చెప్పినట్టు నడుచుకున్నా

టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేశ్‌తో తనకెలాంటి విభేదాలూ లేవని రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి పేర్కొన్నారు. ఇటీవల టీడీపీని వీడి బీజేపీలో చేరిన ఆయన ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను ఆయన పంచుకున్నారు.

తాను తెలుగుదేశం పార్టీలో ఉన్నంత వరకూ అత్యంత గౌరవం లభించిందని సుజనా చౌదరి స్పష్టం చేశారు. తనకు లోకేశ్‌తో ఎలాంటి విభేదాలూ లేవన్నారు. లోకేశ్ పని చూసుకుని చక్కగా ముందుకు వెళితే తాను చాలా సంతోషిస్తానన్నారు. మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు చెప్పినట్టు నడుచుకున్నానని, ప్రతి ఒక్క విషయంలో సాధ్యాసాధ్యాల గురించి చంద్రబాబుకి చెప్పేవాడినన్నారు.

Telugudesam
Sujana Chowdary
Nara Lokesh
Chandrababu
Elections
  • Loading...

More Telugu News