vh: ఎప్పుడూ ఒకే సామాజికవర్గానికే పీసీసీ అధ్యక్ష పదవి ఎందుకివ్వాలి?: వీహెచ్

  • పార్టీకి విధేయుడిగా ఉన్నవారికే పీసీసీ పదవి
  • నా కన్నా విధేయుడు ఎవరున్నారు?
  • పీసీసీ కావాలని జగ్గారెడ్డి ఎలా అడుగుతారు?

మొదటి నుంచి పార్టీకి విధేయుడిగా ఉన్న వారికే పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. పార్టీలో అందరి కంటే సీనియర్ తానే అని... తనకన్నా విధేయుడు ఎవరున్నారని ప్రశ్నించారు. పీసీసీ పదవి ఎప్పుడూ ఒకే సామాజికవర్గానికి ఎందుకివ్వాలని అన్నారు. వచ్చే నెల మొదటి వారంలో పార్టీ విధేయులతో సమావేశం ఏర్పాటు చేస్తానని చెప్పారు.

పీసీసీ చీఫ్ మార్పు ఉండదని ఒకవైపు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి కుంతియా చెబుతుంటే... మరోవైపు తనకు పదవి కావాలని జగ్గారెడ్డి ఎలా అడుగుతారని అసహనం వ్యక్తం చేశారు. ప్యారాచూట్ నేతలకు టికెట్లు ఇవ్వొద్దని చెప్పినా వినకుండా ఇచ్చారని... పార్టీ పేరుతో గెలిచిన వారంతా ఇప్పుడు మరో పార్టీలో చేరుతున్నారని మండిపడ్డారు.

vh
pcc
jagga reddy
congress
  • Loading...

More Telugu News