Anil Kumar Yadav: ప్రజావేదిక అక్రమ కట్టడం అని యనమలకు తెలియదా?: మంత్రి అనిల్ కుమార్ యాదవ్

  • రగులుతున్న ప్రజావేదిక వివాదం
  • అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం
  • యనమల వ్యాఖ్యలకు బదులిచ్చిన మంత్రి అనిల్

ఉండవల్లి ప్రజావేదిక వివాదంలో అధికార, విపక్షాల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. ప్రజావేదిక కూల్చివేయాలంటూ జగన్ ఆదేశించడం ఓ తుగ్లక్ చర్య అని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించడంపై ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. ప్రజావేదిక ఓ అక్రమ కట్టడం అని యనమలకు తెలుసా? లేదా? అని ప్రశ్నించారు.

అక్రమ కట్టడం కాబట్టే ప్రజావేదికను కూల్చేయాలంటూ ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. చంద్రబాబు నివాసం కూడా అక్రమ కట్టడమేనని, అక్రమ నివాసాల్లో ఉండకూడదన్న విషయం యనమలకు తెలియదా? అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు.
అంతకుముందు, 70 శాతం పూర్తయిన పోలవరం నిర్మాణాలను కూడా కూల్చేస్తారా? అంటూ యనమల వ్యాఖ్యానించడంపైనా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ బదులిచ్చారు. పోలవరం అక్రమ ప్రాజక్టు కాదన్న విషయాన్ని యనమల తెలుసుకోవాలని హితవు పలికారు.

Anil Kumar Yadav
Yanamala
Telugudesam
YSRCP
Praja Vedika
  • Loading...

More Telugu News