Komatireddy: ఇప్పుడు నాకే పదవులు వద్దు, ఇచ్చినా కాంగ్రెస్ లో ఉండను: కోమటిరెడ్డి రాజగోపాల్

  • మరో వారం పదిరోజుల్లో బీజేపీలో అధికారికంగా చేరబోతున్నా
  • పీసీసీ పదవి కోరుకున్న మాట నిజమే
  • ప్రజల మద్దతుతో కాంగ్రెస్ ను గెలిపించాలనుకున్నా

తెలంగాణ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి త్వరలోనే బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనను నమ్ముకున్న ప్రజల కోసమే బీజేపీలోకి వెళుతున్నానని స్పష్టం చేశారు. మరో వారం పదిరోజుల్లో బీజేపీలో అధికారికంగా చేరబోతున్నానని వెల్లడించారు. ప్రజల మద్దతుతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ప్రయత్నించానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో పీసీసీ చీఫ్ పదవి కోరుకున్న మాట వాస్తవమేనని, అయితే, ఇప్పుడు మాత్రం తనకు ఎలాంటి పదవులు వద్దని, పదవి ఇచ్చినా కాంగ్రెస్ లో ఉండనని కుండబద్దలు కొట్టారు. ప్రస్తుతం తన మద్దతుదారులంతా తనవెంటే ఉన్నారని, రాబోయే రోజుల్లో బీజేపీదే అధికారం అని స్పష్టం చేశారు.

Komatireddy
Rajagopal Reddy
Congress
BJP
Telangana
PCC
  • Loading...

More Telugu News