Vijayawada: విజయవాడలో జలమయమైన ప్రాంతాలలో పర్యటించిన మంత్రి వెల్లంపల్లి!

  • లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది
  • ఇళ్లల్లోకి చేరిన వర్షపు నీరు
  • మున్సిపల్ అధికారులకు మంత్రి ఆదేశాలు 

విజయవాడలో కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ముఖ్యంగా వన్ టౌన్ ప్రాంతంలోని ఊర్మిళా నగర్, రోటరీ నగర్, గొల్లపాలెంగట్టు తదితర కాలనీల పరిస్థితి ఘోరంగా ఉంది. ఇళ్లల్లోకి నీరు చేరడంతో స్థానికుల పాట్లు అన్నీఇన్నీ కావు. గత ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా తమ సమస్యలను పరిష్కరించలేదని లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వన్ టౌన్ లో జలమయమైన ఆయా ప్రాంతాలను రాష్ట్ర మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పరిశీలించారు. యుద్ధప్రాతిపదికన ఈ సమస్యను పరిష్కరించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.

Vijayawada
One-town
Minister
Vellampalli
  • Loading...

More Telugu News