Manchu Manoj: తాగునీరు లేక చెన్నై విలవిల... మంచినీటి ట్యాంకర్లు పంపించిన మంచు మనోజ్

  • చెన్నైలో అడుగంటిన బోర్లు, ఎండిన రిజర్వాయర్లు
  • స్పందించిన మంచు మనోజ్
  • మిత్రులతో కలిసి మంచినీటి వితరణ

చెన్నై మహానగరంలో తాగునీటి ఎద్దడి తీవ్రస్థాయిలో ఉంది. నీటి కొరత కారణంగా కార్యాలయాలు, హోటళ్లు మూతపడుతున్నాయంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థంచేసుకోవచ్చు. రిజర్వాయర్లు ఎండిపోవడం, బోర్లు అడుగంటడంతో చెన్నై వాసులు గుక్కెడు నీళ్ల కోసం అలమటించిపోతున్నారు. ఈ నేపథ్యంలో, సామాజిక సేవా సంస్థలు, ప్రముఖులు ట్యాంకర్ల ద్వారా మంచినీటిని వితరణ చేస్తున్నారు. తాజాగా, సినీ నటుడు మంచు మనోజ్ కూడా తనవంతు సాయంగా ట్యాంకర్లతో మంచినీరు సరఫరా చేస్తున్నారు.

మనోజ్ పంపిస్తున్న ట్యాంకర్ల వద్ద జనాల రద్దీ చూస్తే తాగునీటి ప్రాధాన్యత ప్రస్తుతం చెన్నై సిటీని ఎంత వేధిస్తుందో తెలుస్తోంది. దీనిపై మనోజ్ స్పందిస్తూ, మిత్రులు, శ్రేయోభిలాషుల సహకారంతో తాగునీటిని ట్యాంకర్లతో సరఫరా చేస్తున్నానని తెలిపారు. తాను పెరిగిన ప్రాంతం కావడంతో చెన్నై పట్ల తనకు మమకారం ఉందని, అందుకే తనవంతు సాయం చేస్తున్నానని ట్వీట్ చేశారు.

Manchu Manoj
Chennai
Water
Crisis
  • Loading...

More Telugu News