Ganta Srinivasa Rao: ఆ వార్తలకు నేను స్పందించాల్సిన అవసరం లేదు: గంటా శ్రీనివాసరావు

  • పార్టీ మారే ప్రసక్తే లేదు
  • ఎన్నికల ముందు కూడా ఇలాంటి కథనాలు వచ్చాయి
  • జై టీడీపీ అంటూ ట్వీట్ చేసిన గంటా

గత కొన్నిరోజులుగా టీడీపీ నుంచి బీజేపీలోకి వలసలు కొనసాగుతుండడం తెలిసిందే. మరికొందరు నేతలు కూడా కాషాయతీర్థం పుచ్చుకుంటారంటూ ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా బీజేపీలోకి వెళతారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై గంటా స్వయంగా వివరణ ఇచ్చారు. తాను పార్టీ మారతానంటూ వస్తున్న వార్తల్లో నిజంలేదని స్పష్టం చేశారు. మీడియాలోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ తన గురించి విపరీతంగా వార్తలు ప్రసారమవుతున్నాయని, అలాంటి అసత్య కథనాల పట్ల స్పందించాల్సిన అవసరం తనకు లేదని ట్వీట్ చేశారు. ఎన్నికల ముందు కూడా ఇలాంటి కథనాలే వచ్చాయని, ఇప్పుడు కూడా వస్తున్నాయని పేర్కొన్నారు. పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదని, జై టీడీపీ అంటూ ట్విట్టర్ ద్వారా బదులిచ్చారు.

Ganta Srinivasa Rao
Telugudesam
  • Loading...

More Telugu News