Kanna: ప్రజావేదికను కోట్లు ఖర్చుచేసి కట్టారు, కూల్చడం సబబు కాదు: కన్నా లక్ష్మీనారాయణ

  • ప్రజావేదిక కూల్చివేత ప్రక్రియ ప్రారంభం
  • స్పందించిన ఏపీ బీజేపీ చీఫ్
  • టీడీపీ సర్కారు వ్యవస్థల దుర్వినియోగానికి పాల్పడిందంటూ ఆరోపణ

ప్రజావేదిక కూల్చివేత నిర్ణయం జగన్ సర్కారు దూకుడుకు సిసలైన నిదర్శనంగా చెప్పుకోవచ్చు. కలెక్టర్ల సమావేశం నిర్వహించిన మరుసటిరోజే ప్రజావేదిక కూల్చివేత ప్రారంభమైంది. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. ప్రజావేదిక కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మితమైందని, అందుకే దాన్ని కూల్చివేయడం కంటే ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలకు ఉపయోగించడం మంచిది అని అభిప్రాయపడ్డారు. గత టీడీపీ సర్కారు వ్యవస్థలను దుర్వినియోగం చేసిందనడానికి ప్రజావేదిక నిర్మాణం ఓ ఉదాహరణ అని, ప్రజాధనంతోనే ప్రజావేదిక నిర్మించారని ఆరోపించారు. అయితే, ప్రజాధనం దుర్వినియోగం కావడాన్ని తాను అంగీకరించలేనని కన్నా స్పష్టం చేశారు.

Kanna
BJP
Jagan
YSRCP
Telugudesam
Praja Vedika
  • Loading...

More Telugu News