call money: కాల్ మనీ సెక్స్ రాకెట్ పై జగన్ ఆగ్రహం

  • సెక్స్ రాకెట్ లో ఏ పార్టీ వారు ఉన్నా విడిచిపెట్టొద్దు
  • ఫిర్యాదులు ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోండి
  • ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగును నియంత్రించండి

పలువురు మహిళల జీవితాలను అంధకారం చేసిన కాల్ మనీ సెక్స్ రాకెట్ అంశంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ, పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు.

కలెక్టర్ల సదస్సు రెండో రోజున ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఈ సెక్స్ రాకెట్ లో ఏ పార్టీ వారు ఉన్నా ఉపేక్షించవద్దని చెప్పారు. ఫిర్యాదులు ఉన్న వారందరిపైనా వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విజయవాడ నగరంలో ఇలాంటి దారుణ ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమని చెప్పారు. పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగును నియంత్రించాలని జగన్ సూచించారు. విశాఖ జిల్లాలోని 6 మండలాలు, తూర్పుగోదావరి జిల్లాలోని 2 మండలాల్లో గంజాయి సాగవుతోందని... రెవెన్యూ, పోలీసు, అటవీ, ఎక్సైజ్, వ్యవసాయ శాఖలు సంయుక్తంగా దీన్ని అరికట్టే ప్రయత్నం చేయాలని అన్నారు. గంజాయి సాగుకు సంబంధించి పోలీసు ఇంటెలిజెన్స్, గ్రేహౌండ్స్ విభాగాలు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. స్థానిక గిరిజనులకు ఉపాధి కల్పించడం ద్వారా దీన్ని అరికట్టవచ్చని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News