Puri Jagannadh: పూరి జగన్నాథ్ గురించి ఒక ఆసక్తికర విషయాన్ని బయటపెట్టిన రామ్ గోపాల్ వర్మ

  • 'శివ' సినిమాలో స్టెప్పులేసిన పూరి జగన్నాథ్
  • వీడియో పోస్ట్ చేసిన వర్మ
  • హేయ్ పూరి... వాట్ ఏ జర్నీ అంటూ కితాబు

ప్రముఖ సినీ దర్శకులు రామ్ గోపాల్ వర్మ, పూరి జగన్నాథ్ ల మధ్య ఉన్న అనుబంధం ఎలాంటిదో అందరికీ తెలిసిందే. వర్మ స్కూల్ నుంచి వచ్చిన పూరి జగన్నాథ్... ఆ తర్వాత టాప్ డైరెక్టర్ గా ఎదిగారు. తాజాగా జగన్ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని వర్మ ట్విట్టర్ ద్వారా బయటపెట్టారు. నాగార్జున, వర్మ కాంబినేషన్ లో వచ్చిన 'శివ' సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పూరి జగన్నాథ్ కూడా కనిపించారు.

ఈ సినిమాలో 'బోటనీ పాఠముంది... మేటనీ ఆట ఉంది.. దేనికో ఓటు చెప్పరా' అనే సాంగ్ చాలా హిట్ అయింది. ఇందులో పూరి జగన్నాథ్ కూడా స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేసిన వర్మ... బ్లూ షర్ట్ లో కనిపించే జూనియర్ ఆర్టిస్ట్... ఈ నాటి సూపర్ డైరెక్టర్ పూరి జగన్ అని తెలిపారు. 'హేయ్ పూరి... వాట్ ఏ జర్నీ' అంటూ కితాబిచ్చారు. ఈ ట్వీట్ కు స్పందించిన పూరి జగన్నాథ్... 'యస్ సార్' అంటూ ధన్యవాదాలు తెలిపారు.



Puri Jagannadh
ram gopal varma
shiva
dance
  • Loading...

More Telugu News