Ram: షాట్లో కాల్చినా తమ్మీ... బ్రేక్ లో కాద్!: సిగరెట్ తాగిన వివాదంపై హీరో రామ్ ట్వీట్

  • చార్మినార్ వద్ద సిగరెట్ తాగిన రామ్
  • రూ. 200 ఫైన్ వేసిన పోలీసులు
  • సినిమాలో సీన్ ఉందన్న రామ్

చార్మినార్ వద్ద 'ఇస్మార్ట్ శంకర్' షూటింగ్ జరుగుతున్న సమయంలో హీరో రామ్ సిగరెట్ కాల్చినందున పోలీసులు ఫైన్ వేసిన సంగతి తెలిసిందే. బహిరంగ ప్రదేశంలో ధూమపానం చేసిందుకు రూ. 200 జరిమానా విధించడంతో, రామ్ చెల్లించాడు కూడా. ఈ విషయమై ఈ ఉదయం స్పందించిన రామ్, తన ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ పెట్టాడు.

"నా టైమూ, పబ్లిక్ టైమూ వేస్ట్ చేయడం ఇష్టం లేక రెస్పాండ్ గాలే... షాట్లో కాల్చినా తమ్మీ, బ్రేక్ లా కాద్. టైటిల్ సాంగ్ లా చూస్తావుగా స్టెప్పు. ఫిర్ భీ లాకి ఇజ్జత్ ఇచ్చి ఫైన్ కట్టినం. గుపుడు నువ్వు కూడా నా లెక్క. లైట్ తీస్కో పని చూస్కో... ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్" అని ట్వీట్ పెట్టాడు. రామ్ పెట్టిన ట్వీట్ వైరల్ అవుతోంది. 

Ram
Ismart Shankar
Shooting
Charminar
  • Error fetching data: Network response was not ok

More Telugu News