Jagan: మీరు మాటిస్తే తప్పరని మాకు ముందే తెలుసు సార్!: సీఎంను ఉద్దేశించి ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్

  • పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు చేసిన జగన్
  • కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో గుర్తు చేసిన సవాంగ్
  • పోలీసుల తరఫున జగన్ కు కృతజ్ఞతలు

"డియర్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సార్... మీరు మాటిస్తే తప్పరని మాకు ముందే తెలుసు. విధి నిర్వహణలో నిత్యమూ ఎన్నో ఒత్తిళ్లకు గురయ్యే పోలీసులకు వీక్లీ ఆఫ్ విషయంలో మీరు ఇచ్చిన హామీని అమలు చేశారు. అందుకు పోలీసు శాఖ తరఫున మీకు కృతజ్ఞతలు" అని డీజీపీ గౌతమ్ సవాంగ్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం ఉండవల్లిలోని ప్రజా వేదికలో కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ జరిపిన సమావేశంలో ఆయన ప్రసంగించారు.

 ఇదే సమయంలో పోలీసులు, హోమ్ గార్డులకు అలవెన్స్ లను పెంచాలని తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ప్రజలతో స్నేహపూర్వకంగా ఉండేలా చూస్తామని, ఇదే సమయంలో నేరగాళ్లను అణచివేయడంలో ఎంతమాత్రమూ అలసత్వాన్ని ప్రదర్శించబోమని అన్నారు. జాతీయ రహదారులపై ప్రమాదాలు పెరిగిన నేపథ్యంలో, వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలు, చట్టాలపై అవగాహన పెంచుతామని తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేసేలా వైఎస్ జగన్ నాయకత్వం కొనసాగాలని ఆశిస్తున్నట్టు గౌతమ్ సవాంగ్ వ్యాఖ్యానించారు.

Jagan
Gautam Sawang
Police
Andhra Pradesh
Weekly Off
  • Loading...

More Telugu News