Ambika Krishna: చంద్రబాబుకు చెబుదామంటే లేరు... బాలకృష్ణకు మాత్రం చెప్పాను: అంబికా కృష్ణ

  • చంద్రబాబు అందుబాటులో లేరు
  • నేనేమీ టీడీపీకి ద్రోహం చేయలేదు
  • బీజేపీలో చేరిన అనంతరం అంబికా కృష్ణ

తాను పార్టీని మారాలని నిర్ణయించుకున్న తరువాత, ఆ విషయాన్ని చంద్రబాబునాయుడికి చెప్పలేదని సినీ నిర్మాత అంబికా కృష్ణ వెల్లడించారు. బీజేపీలో చేరిన ఆయన, మీడియాతో మాట్లాడుతూ, ఈ విషయాన్ని చంద్రబాబుకు చెబుదామనే అనుకున్నానని, అయితే, ఆయన అందుబాటులో లేరని అన్నారు. అందుకే హీరో బాలకృష్ణకు విషయం చెప్పానని తెలిపారు. తానేమీ తెలుగుదేశం పార్టీకి ద్రోహం చేయలేదని స్పష్టం చేశారు. బీజేపీతో తెలుగుదేశం పార్టీకి ఉన్న విభేదాలు, కాంగ్రెస్‌ తో కలవడం, సుమారు 60 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టిక్కెట్లివ్వడం తదితర కారణాలతోనే టీడీపీ ఓడిపోయిందని అంబికా కృష్ణ అభిప్రాయపడ్డారు.

Ambika Krishna
Chandrababu
Balakrishna
Telugudesam
  • Loading...

More Telugu News