Hyderabad: ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం.. యువకుడి మృతి, యువతి పరిస్థితి విషమం

  • గొడవపడిన ప్రేమికుల తల్లిదండ్రులు
  • పెళ్లి జరిగే అవకాశం లేదని మనస్తాపం
  • కూల్ డ్రింక్‌లో పురుగుల మందు కలిపి తాగిన ప్రేమికులు

ప్రేమ పెళ్లికి పెద్దలు నిరాకరించడం, ప్రేమికుల తల్లిదండ్రులు గొడవపడడంతో మనస్తాపం చెందిన ఓ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో యువకుడు ప్రాణాలు కోల్పోగా, యువతి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా రాగన్నగూడకు చెందిన సందీప్‌రెడ్డి బంధువైన ఓ యువతిని ప్రేమించాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.

విషయం తెలిసిన ప్రేమికుల తల్లిదండ్రులు ఇద్దరూ గొడవపడ్డారు. విషయం తెలిసిన ప్రేమికులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తమ పెళ్లి జరిగే అవకాశం లేదని భావించిన ఇద్దరూ సోమవారం రాత్రి ఆత్మహత్యాయత్నం చేశారు. దిల్‌సుఖ్‌నగర్‌లో యువకుడు అద్దెకు ఉండే గదిలో కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలిపి తాగారు. గమనించిన చుట్టుపక్కల వారు అపస్మారకస్థితిలో పడి ఉన్న ఇద్దరినీ మలక్‌పేటలోని యశోదా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు. యువతి పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న చైతన్యపురి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad
Nalgonda District
lovers
Suicide
  • Loading...

More Telugu News