ప్రజావేదిక ఉన్న ప్రాంతంలో స్వరూపానంద యాగం చేస్తే ఇద్దరు సీఎంలు గంటల తరబడి కూర్చున్నారు: పంచుమర్తి అనురాధ
- వివాదాస్పదంగా మారిన ప్రజావేదిక
- గత ప్రభుత్వ హయాంలో నిర్మాణం
- రూ.9 కోట్ల వ్యయం!
ఈ నేపథ్యంలో టీడీపీ మహిళా నేత పంచుమర్తి అనురాధ ఘాటుగా స్పందించారు. ఏది సక్రమ కట్టడమో, ఏది అక్రమ కట్టడమో సీఎం జగన్ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇప్పుడు ప్రజావేదిక ఉన్న ప్రాంతంలో గతంలో స్వరూపానంద యాగం చేస్తే ఇద్దరు సీఎంలు గంటల తరబడి కూర్చున్నారని, మరి వాళ్లకు ఎందుకు అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు.