Ambika Krishna: టీడీపీనే నాకు నమ్మకద్రోహం చేసింది... చంద్రబాబు తీరు నచ్చలేదు: అంబికా కృష్ణ

  • మోదీ నాయకత్వ లక్షణాలు నచ్చాయి
  • బీజేపీలో చేరేందుకు మరికొందరు సిద్ధంగా ఉన్నారు
  • బీజేపీలో చేరిన అంబికా కృష్ణ

ఏపీలో బీజేపీ 'ఆపరేషన్ ఆకర్ష్' కొనసాగుతోంది. టీడీపీ నుంచి ఇటీవలే నలుగురు రాజ్యసభ సభ్యులు కాషాయ కండువాలు కప్పుకున్న నేపథ్యంలో, సైకిల్ పార్టీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఏలూరు టీడీపీ నేత, సినీ ప్రముఖుడు అంబికా కృష్ణ బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తానేమీ టీడీపీకి ద్రోహం చేయలేదని అన్నారు.

ఎంతో కష్టపడి పనిచేస్తే టీడీపీనే తనకు నమ్మకద్రోహం చేసిందని ఆరోపించారు. ఎన్నికల్లో టీడీపీ ఓటమికి చంద్రబాబే కారణమని ఆరోపించారు. ఓ దశలో చంద్రబాబు బీజేపీ మీద చేసిన పోరాటాలు తనకు నచ్చలేదని చెప్పారు. బీజేపీతో విభేదాలు వద్దని చెప్పినా చంద్రబాబు వినిపించుకోలేదని అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వ లక్షణాలు నచ్చడంతో బీజేపీలో చేరానని, త్వరలోనే మరికొందరు నేతలు బీజేపీలో చేరుతున్నారని అంబికా కృష్ణ వ్యాఖ్యానించారు.

Ambika Krishna
BJP
Telugudesam
Chandrababu
  • Loading...

More Telugu News