Sania Mirza: లండన్ వీధుల్లో సానియా మీర్జా కొడుకుతో ఉపాసన షికార్లు

  • వరల్డ్ కప్ కోసం యూకే వెళ్లిన సానియా, ఉపాసన
  • లండన్ వీధుల్లో విహారం
  • సానియా సోదరితో అజహరుద్దీన్ తనయుడు చెట్టాపట్టాల్!

టాలీవుడ్ అగ్రహీరో రామ్ చరణ్ అర్ధాంగి ఉపాసన, టెన్నిస్ తార సానియా మీర్జా మంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే. తాజాగా, మిత్రురాళ్లిద్దరూ లండన్ లో కలిశారు. భర్త షోయబ్ మాలిక్ వరల్డ్ కప్ లో ఆడుతుండడంతో సానియా యూకేలో అడుగుపెట్టింది. ఉపాసన కూడా క్రికెట్ అభిమాని కావడంతో ప్రపంచ కప్ మ్యాచ్ లు ప్రత్యక్షంగా చూసేందుకు వచ్చింది. ఈ క్రమంలో ఉపాసన, సానియా లండన్ వీధుల్లో విహరించారు. ముఖ్యంగా, సానియా కొడుకు ఇజాన్ తో ఉపాసన షికార్లు చేసింది. ఇజ్జూతో లండన్ వీధుల్లో షికార్లు అంటూ ట్విట్టర్ లో పోస్టు పెట్టింది.

కాగా, సానియాతో పాటు ఆమె సోదరి ఆనమ్ మీర్జా కూడా ఉన్నారు. వారే కాదు, ఆనమ్ మీర్జా బాయ్ ఫ్రెండ్ అసద్ అజహరుద్దీన్ కూడా ఈ గ్యాంగ్ తో కలిసి లండన్ లో ఎంజాయ్ చేశాడు. అసద్ ఎవరో కాదు, భారత క్రికెట్ జట్టు మాజీ సారథి అజహరుద్దీన్ తనయుడు. త్వరలోనే ఆనమ్, అసద్ పెళ్లిచేసుకుంటారని టాక్ వినిపిస్తోంది.

Sania Mirza
Upasana
  • Loading...

More Telugu News