Andhra Pradesh: బీజేపీలో చేరిన టీడీపీ నేత అంబికా కృష్ణ

  • ఢిల్లీలో బీజేపీ కండువా కప్పుకున్న అంబికా కృష్ణ
  • రాంమాధవ్ సమక్షంలో పార్టీలో చేరిక
  • అంబికాను అభినందించిన బీజేపీ నేతలు

ఏపీ టీడీపీ సీనియర్ నేత, ఏలూరు మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ బీజేపీలో చేరారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్ సమక్షంలో ఈరోజు సాయంత్రం కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా అంబికా కృష్ణను బీజేపీలోకి సాదరంగా ఆహ్వానించారు. బీజేపీలో చేరిన ఆయనను రాంమాధవ్ సహా పలువురు నేతలు అభినందించారు. కాగా, మొన్నటివరకు ఏపీఎఫ్డీసీ చైర్మన్ గా అంబికా కృష్ణ ఉన్నారు. ఏపీలో బీజేపీ ‘ఆపరేషన్ ఆకర్ష్’ జోరుగా సాగుతోంది. త్వరలో కొందరు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరబోతున్నట్టు సమాచారం.

Andhra Pradesh
bjp
Telugudesam
ambika krishna
delhi
  • Loading...

More Telugu News