Andhra Pradesh: ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణతో ఎంపీ సుజనా చౌదరి భేటీ!

  • ఇటీవల బీజేపీలో చేరిన సుజనా
  • ఏపీలో పార్టీని బలోపేతం చేయడంపై చర్చ
  • క్షేత్రస్థాయిలో కేడర్ పటిష్టతపై దృష్టి

 రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఇటీవల బీజేపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. రాజ్యసభ సభ్యులు సీఎం రమేశ్, గరికపాటి రామ్మోహన్, టీజీ వెంకటేశ్ తో కలిసి ఆయన బీజేపీలో చేరారు. ఈ రోజు ఆయన ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కలుసుకున్నారు. ఢిల్లీలోని పార్లమెంటు కార్యాలయానికి వచ్చిన సుజనా, కన్నాతో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా 2024 అసెంబ్లీ ఎన్నికల నాటికి బీజేపీని ఆంధ్రప్రదేశ్ లో బలోపేతం చేయడంపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. అలాగే క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేయడంపై దృష్టి సారించాలని నిర్ణయించారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేయడంపై కూడా వీరు చర్చించినట్లు సమాచారం.  

Andhra Pradesh
BJP
kanna
Sujana Chowdary
meeting
New Delhi
Telugudesam
  • Loading...

More Telugu News