Telangana: 29 జిల్లాలలో టీఆర్ఎస్ నూతన కార్యాలయ భవనాలకు శంకుస్థాపనలు

  • ఒకే రోజు 29 చోట్ల శంకుస్థాపనలు
  • సిరిసిల్లలో పార్టీ కార్యాలయానికి కేటీఆర్ శంకుస్థాపన
  • ఒక్కో జిల్లా కార్యాలయానికి రూ.60 లక్షలు కేటాయింపు

రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ జిల్లా కార్యాలయ భవనాల శంకుస్థాపనా కార్యక్రమాలు జరిగాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పార్టీ కార్యాలయానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కేటీఆర్ శంకుస్థాపన చేశారు. వేములవాడ శాసనసభ్యుడు చెన్నమనేని రమేష్ బాబు, జెడ్పీ చైర్మన్ అరుణ, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఖమ్మం, వనపర్తి మినహా ఒకే రోజు 29 చోట్ల శంకుస్థాపనలు చేశారు. తొమ్మిది చోట్ల మంత్రులు, మిగతా జిల్లాల్లో జిల్లా పరిషత్ చైర్ పర్సన్లు శంకుస్థాపనలు చేశారు. ఒక్కో జిల్లా కార్యాలయానికి రూ.60 లక్షల చొప్పున పార్టీ అధిష్ఠానం కేటాయించింది.

Telangana
TRS
party offices
ground breaking
  • Loading...

More Telugu News