ongole: ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసిన ఆ వెధవలకి కఠిన శిక్ష పడాలి: ఎమ్మెల్యే రోజా

  • నిందితులను కఠినంగా శిక్షించాలి
  • ఆడపిల్లలకు పూర్తి రక్షణ కల్పించే ప్రభుత్వం మాది
  • వరుస ట్వీట్లు చేసిన రోజా

ఒంగోలులో మైనర్ బాలికను అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వైసీపీ ఎమ్మెల్యే రోజా కోరారు. పది రోజుల పాటు 16 ఏళ్ల బాలికను అత్యాచారం చేసిన ఆ కామాంధులకు పడే శిక్షను చూసి ఆడపిల్లల వైపు కన్నెత్తి చూడాలంటే భయపడేలా శిక్షించాలని అన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అంటే ఆడపిల్లలకు పూర్తి రక్షణ కల్పించే ప్రభుత్వమని, ఇప్పటికే తమ సోదరి సమానురాలైన హోమ్ మంత్రి సుచరిత స్పందించి కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారని చెప్పారు. ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసిన ఆ వెధవలకి కఠిన శిక్ష పడాలని కోరుకుంటున్నానని రోజా తన వరుస ట్వీట్లలో పేర్కొన్నారు.  

ongole
gang rape
YSRCP
mla
roja
  • Loading...

More Telugu News