rajasekhar: 'కల్కి'ఓ డిఫరెంట్ మూవీ .. హిట్ కొట్టడం ఖాయం: హీరో రాజశేఖర్

- రాజశేఖర్ తాజా చిత్రంగా 'కల్కి'
- యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ
- ఈ నెల 28వ తేదీన సినిమా విడుదల
రాజశేఖర్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ గా 'కల్కి' సినిమా రూపొందింది. ఆదా శర్మ కథానాయికగా నటించిన ఈ సినిమాను, ఈ నెల 28వ తేదీన విడుదల చేయనున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో, ఈ సినిమా ప్రమోషన్స్ లో రాజశేఖర్ బిజీ అయ్యారు.
