ambika krishna: టీడీపీకి మరో షాక్... బీజేపీలో చేరనున్న అంబికా కృష్ణ

  • ఢిల్లీ చేరుకున్న అంబికా కృష్ణ 
  • బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం
  • టీడీపీ శిబిరంలో కలవరం

ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరడంతో టీడీపీ శిబిరంలో కలవరం మొదలైంది. మరోవైపు, భారీ ఎత్తున టీడీపీ నుంచి చేరికలు ఉండబోతున్నాయంటూ బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు మరింత వేడి పుట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, టీడీపీకి మరో షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఆయన ఢిల్లీ కూడా చేరుకున్నారు.

2014లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంబికా కృష్ణను ఫిల్మ్, టెలివిజన్ మరియు థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా చంద్రబాబు నియమించారు. ఎన్నికల సమయంలో అప్పటి మంత్రి పీతల సుజాతపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. అనంతరం తన వ్యాఖ్యలకు ఆయన క్షమాపణలు కూడా చెప్పారు. బాలకృష్ణతో కూడా అంబికా కృష్ణకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన పార్టీ మారతుండటం టీడీపీకి పెద్ద లోటనే చెప్పాలి.

ambika krishna
Telugudesam
bjp
  • Loading...

More Telugu News